నటభూషణ్‌కు అభిమానుల నివాళి
ABN , First Publish Date - 2021-03-21T06:01:57+05:30 IST
ఆంధ్రుల అభిమాన కథానాయకుడు, నటభూషణ్ శోభన్‌బాబు 13వ వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

విశాఖలో శోభన్‌బాబు వర్ధంతి నిర్వహించిన అభిమాన సంఘం ప్రతినిధులు
కంచరపాలెం, మార్చి 20: ఆంధ్రుల అభిమాన కథానాయకుడు, నటభూషణ్ శోభన్‌బాబు 13వ వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శోభన్‌బాబు నటజీవితం, పాటలు గుర్తు చేసు కున్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. అభిమానుల సంఘం ప్రతినిధులు కొణతాల వెంటకరావు, గువ్వల రమణ, కె.శోభన్‌బాబు, నాగరాజు, సూర్యనారాయణ, దేవకి, సూర్యరత్నం తదితరులు పాల్గొన్నారు.