మన్యం గజగజ

ABN , First Publish Date - 2021-02-05T06:45:48+05:30 IST

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.

మన్యం గజగజ
పాడేరు మండలం మినుములూరు ప్రాంతంలో గురువారం దట్టంగా పొగ మంచు

జి.మాడుగులలో 3, హుకుంపేట, చింతపల్లి, పాడేరుల్లో 4 డిగ్రీలు నమోదు 


పాడేరు/అరకులోయ టౌన్‌, ఫిబ్రవరి 4: మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గురువారం జి.మాడుగులలో మూడు, హుకుంపేట, చింతపల్లి, పాడేరుల్లో నాలుగు, గూడెంకొత్తవీధిలో ఐదు, మినుములూరు, అరకులోయల్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు ఉంటోంది. అలాగే పగటి వేళల్లో సైతం చలి గాలులు వీస్తున్నాయి. దీంతో మన్యం వాసులు వణుకుతున్నారు.  ఫిబ్రవరి నెలలో ఇంతటి చలిని గతంలో ఎప్పుడూ చూడలేదని  వాపోతున్నారు. గత నెల చివరి వరకు తగ్గుతూ వచ్చిన చలి  ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా పెరిగింది.

Updated Date - 2021-02-05T06:45:48+05:30 IST