గంజాయి తరలిస్తున్న ఆరుగురు అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-30T05:50:09+05:30 IST
గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు కూర్మన్నపాలెం దరి శివాజీ నగర్ వద్ద బుధవారం మాటువేసి పట్టుకున్నారు

కూర్మన్నపాలెం, డిసెంబరు 29: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు కూర్మన్నపాలెం దరి శివాజీ నగర్ వద్ద బుధవారం మాటువేసి పట్టుకున్నారు. చోడవరం నుంచి విశాఖ నగరానికి వ్యాన్‌లో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌తోపాటు నిందితులు వినియోగించిన మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరవాడకు చెందిన జోగ సంజీవయ్య, రావికమతానికి చెందిన గండ్రెడ్డి నాగు, గండ్రెడ్డి సంతోశ్, జి.మాడుగులకు చెందిన కోన శివ, చీడికాడకు చెందిన ముత్యాలరాజు, జీడి దేముడులను అరెస్ట్ చేశారు.