విశాఖ స్టీల్‌ ప్లాంటు పరిరక్షణ కమిటీకి జనసేన మద్దుతు: శివశంకర్

ABN , First Publish Date - 2021-10-29T16:54:24+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షణ కమిటీకి జనసేన మద్దుతు తెలుపుతుందని జనసేన నేత శివశంకర్ తెలిపారు.

విశాఖ స్టీల్‌ ప్లాంటు పరిరక్షణ కమిటీకి జనసేన మద్దుతు: శివశంకర్

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షణ కమిటీకి జనసేన మద్దుతు తెలుపుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ పవన్ కళ్యాణ్‌ని కలిసిందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయడం అందరిని కలిచివేసిందన్నారు. పవన్ వస్తే ఉద్యమం మరింత ఉదృతం అవుతుందన్నారు. ఈ నెల 31న పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్‌కు వస్తున్నారని, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో ముందుకు సాగుతామన్నారు. ఇప్పటికే 7 వేల మంది నిర్వాసితులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారని శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-29T16:54:24+05:30 IST