వైభవంగా సీతారాముల తీర్థమహోత్సవం
ABN , First Publish Date - 2021-01-21T05:10:33+05:30 IST
మండల కేంద్రంలో బుధవారం సీతారామల తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచే భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

సబ్బవరం, జనవరి 20: మండల కేంద్రంలో బుధవారం సీతారామల తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచే భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సాము గరిడీలు, చిటెకల భజనలు, బాణసంచా కాల్పుల మధ్య ఉత్సవం కన్నుల పండువగా సాగింది.
నేడు గుండాలమ్మ తీర్థం
పరవాడ: మండల కేంద్రంలోని పరవాడ రెడ్డి వారి కుటుంబీకుల ఆరాధ్య దేవత గుండాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని గురువారం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం అన్నసమారాధన, సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.
పరసలలో కొరవడిన సందడి
పెందుర్తిరూరల్: సంక్రాంతి పండగ తర్వాత పెందుర్తి మండలంలో నిర్వహిస్తున్న పరసలలో సంద డి కొరవడింది. ఏ కార్యక్రమంలోనూ పట్టుమని పదిమంది సందర్శకులు కూడా లేక నిర్వాహకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పోలీసుల ఆంక్షల కారణంగా పరసలు వెలవెలబోతున్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా కరోనా ప్రభావంతో ఈఏడాది బుర్రకథల ప్రదర్శనలకు కూడా అనుమతులు లభించలేదు. దీంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. సబ్బవరం మండలంలో ప్రదర్శనలకు అనుమతించిన పోలీసులు ఇక్కడ ఆంక్షలు విధించడం దారుణమని విమర్శిస్తున్నారు.