సింగపూర్‌ విమానం పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-12-30T06:19:55+05:30 IST

కరోనా తరువాత విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు బుధవారం రాత్రి ప్రారంభమైంది.

సింగపూర్‌ విమానం పునఃప్రారంభం
మొదటి ప్రయాణికుడికి టికెట్‌ను అందజేస్తున్న దృశ్యం

విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కరోనా తరువాత విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు బుధవారం రాత్రి ప్రారంభమైంది. స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ వారానికి మూడు రోజులు విమానం నడపడానికి ముందుకు వచ్చింది. ప్రారంభ ఆఫర్‌గా టిక్కెట్‌ను రూ.8,500కే అందిస్తోంది. 180 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం నడుపుతోంది. దీనిని విమానాశ్రయం డైరెక్టర్‌ శ్రీనివాసరావు, ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు రాజ్‌కుమార్‌, నరేశ్‌కుమార్‌, డీఎస్‌ వర్మ తదితరులు ప్రారంభించారు. వీరంతా కలిసి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుడికి తొలి టికెట్‌ను అందించారు.


సింగపూర్‌ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి రాక

సింగపూర్‌ వెళ్లాలనుకున్న ఢిల్లీకి చెందిన వ్యక్తి ఒకరు అక్కడి నుంచి సింగపూర్‌ టిక్కెట్‌ ధర రూ.90 వేలు వుండడంతో విశాఖ నుంచి సింగపూర్‌కు వెళుతున్నారని డీఎస్‌ వర్మ తెలిపారు. విశాఖ నుంచి సింగపూర్‌కు జనవరి ఐదో తేదీ టికెట్‌ ధర ప్రస్తుతం రూ.8,400 వుండగా, రెండో తేదీన రూ.30వేలు పలుకుతోందన్నారు. డిమాండ్‌ మేరకు టికెట్‌ రేట్లు మారుతుంటాయని, ఇక్కడ నుంచి కొత్తగా ప్రారంభించిన సర్వీసు కావడంతో తక్కువ రేటుకు ఇస్తున్నారని వివరించారు. 


Updated Date - 2021-12-30T06:19:55+05:30 IST