ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సంరక్షణకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి

ABN , First Publish Date - 2021-03-22T04:46:11+05:30 IST

అంతరించిపోతున్న ఆలివ్‌రిడ్లే సంతతికి చెందిన తాబేళ్లను సంరక్షించేందుకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి చేస్తుందని ఆ సంస్థ జీజీఎం దివాకర్‌ కౌశిక్‌ తెలిపారు.

ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సంరక్షణకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి
తాబేళ్ల పిల్లలను ముత్యాలమ్మపాలెం తీరం వద్ద సముద్రంలోకి విడిచిపెడుతున్న దివాకర్‌ కౌశిక్‌

సంస్థ జీజీఎం దివాకర్‌ కౌశిక్‌

పరవాడ, మార్చి 21: అంతరించిపోతున్న ఆలివ్‌రిడ్లే సంతతికి చెందిన తాబేళ్లను సంరక్షించేందుకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి చేస్తుందని ఆ సంస్థ జీజీఎం దివాకర్‌ కౌశిక్‌ తెలిపారు. ఆలివ్‌ రిడ్లే సంతతికి చెందిన తాబేళ్ల పిల్లలను సంస్థ అధికారులతో కలిసి ఆయన ఆదివారం తెల్లవారుజామున ముత్యాలమ్మపాలెం తీరం వద్ద సముద్రంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాబేళ్ల సంరక్షణపై సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం 2015 సంవత్సరంలోనే అటవీ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. దీనిలో భాగంగానే ముత్యాలమ్మపాలెం తీరంలో తాబేళ్ల గుడ్లను పొదిగించేందుకు హేచరీలను ఏర్పాటు చేశామన్నారు. హెచరీల ద్వారా పిల్లలను సంరక్షించి వాటిని సముద్రంలో విడిచిపెడుతున్నామన్నారు. దీనికి సింహాద్రి సీఎస్‌ఆర్‌ నిధులను వెచ్చిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి ఎన్టీపీసీ వివిధ విభాగాల జీఎంలు, ఏజీఎంలు, ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-22T04:46:11+05:30 IST