కునుకూరు, చీడిపల్లి టీచర్లకు షోకాజ్‌లు
ABN , First Publish Date - 2021-11-26T06:19:48+05:30 IST
విధులకు ఎగనామం పెడుతున్న కునుకూరు, చీడిపల్లి ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఎంఈవో బోడం నాయుడు తెలిపారు.

కొయ్యూరు, నవంబరు 25: విధులకు ఎగనామం పెడుతున్న కునుకూరు, చీడిపల్లి ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఎంఈవో బోడం నాయుడు తెలిపారు. గురువారం సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఈ రెండు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు బంగారు పాప, గంగా భవాని విధులకు హాజరు కాలేదు. దీంతో ఎంఈవో సహచర ఉపాధ్యాయులను విచారించారు. అనంతరం గ్రామస్థులను విచారిం చారు. తరచూ ఆ టీచర్లు తరచూ విధులకు హాజరు కావడం లేదని నిర్ధారించుకున్న తర్వాత వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.