89వ వార్డులో వలంటీర్ల కొరత

ABN , First Publish Date - 2021-08-22T04:48:27+05:30 IST

జీవీఎంసీ 89వ వార్డులో వలంటీర్ల కొరత వేధిస్తోంది. దీంతో ఆయా ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

89వ వార్డులో వలంటీర్ల కొరత
నాగేంద్రకాలనీ సచివాలయం

వార్డు వాసులకు తప్పని ఇబ్బందులు

స్పందించని ఉన్నతాధికారులు

గోపాలపట్నం, ఆగస్టు 21: జీవీఎంసీ 89వ వార్డులో వలంటీర్ల కొరత వేధిస్తోంది. దీంతో ఆయా ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే వలంటీర్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ వార్డు వాసులు అవస్థలు పడుతున్నారు. వార్డు పరిధిలోని కొత్తపాలెం, యల్లపువానిపాలెంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లు లేరు. వలంటీర్ల నియామకం జరిగిన తరువాత ఆయా ప్రాంతాల్లో సుమారు 10 మంది  విధుల నుంచి తప్పుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వలంటీర్ల నియామకం జరగలేదు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం 15 మందికి పైగా వలంటీర్ల అవసరం ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో వలంటీర్లు ఉద్యోగం విడిచిపెట్టి నెలలు గడుస్తున్నా కొత్తవారి నియామకానికి అధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీంతో వలంటీర్లు లేని ప్రాంతాల ప్రజలకు సరైన సమాచారం అందక ప్రతి అవసరానికి సచివాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రేషన్‌, పింఛన్లు పొందే సమయంలో వీరికి సరైన సమాచారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లో వలంటీర్ల నియామకానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2021-08-22T04:48:27+05:30 IST