పద్మనాభంలో ‘ఒక్కడే వీరుడు’ సినిమా షూటింగ్‌

ABN , First Publish Date - 2021-12-25T06:03:21+05:30 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా తుది దశకు చేరుకుంది. దీనికి ‘ఒక్కడే వీరుడు’ పేరును ఖరారు చేసినట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ మేరకు మండలంలోని కుర్రపల్లి గ్రామంలో శుక్రవారం పలు సన్నివేశాలను చిత్రీకరించారు.

పద్మనాభంలో ‘ఒక్కడే వీరుడు’ సినిమా షూటింగ్‌
అల్లూరి సీతారామరాజు, బ్రిటిష్‌ అధికారులపై సన్నివేశం చిత్రీకరణ

అల్లూరి వాస్తవ కథతో తెరకెక్కుతున్న చిత్రం 

పద్మనాభం, డిసెంబరు 24: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా తుది దశకు చేరుకుంది. దీనికి ‘ఒక్కడే వీరుడు’ పేరును ఖరారు చేసినట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ మేరకు మండలంలోని కుర్రపల్లి గ్రామంలో శుక్రవారం పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అల్లూరి పోరాట బాట పట్టిన మన్యంలోని దృశ్యాలతో పాటు   సీతారామరాజును పట్టుకునేందుకు అసోం రైఫిల్స్‌, మద్రాస్‌ పోలీసు దళాలు వేర్వేరుగా చేసిన ప్రయత్నాలను చిత్రీకరించారు. అనఘాదేవి ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నిర్మాత ఆర్‌ఎస్‌ సత్యనారాయణరాజు, దర్శకుడు వెంకట పంపన. షణ్ముక్‌ లోకనాఽథం కెమెరా, ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అల్లూరి జన్మస్థానమైన పాండ్రంగి పరిసర ప్రాంతాలతో పాటు, ఆయన పోరాటం చేసిన మన్యంలోని పలు ప్రదేశాలలో సినిమాను చిత్రీకరించామని నిర్మాత, దర్శకులు తెలిపారు.  ఫిబ్రవరిలో  చిత్రాన్ని  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అల్లూరి పాత్రలో శివరామరాజు నటిస్తున్న ఈ సినిమాలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పార్వతీపురం మాజీ ఎంపీ డీవీజీ శంకరరావుతో పాటు స్థానికులకు కూడా నటించే అవకాశం కల్పించారు. 

Updated Date - 2021-12-25T06:03:21+05:30 IST