మరో మైలురాయిని దాటిన షిప్‌యార్డు
ABN , First Publish Date - 2021-03-25T05:03:53+05:30 IST
హిందుస్థాన్ షిప్‌యార్డు మరో మైలురాయిని దాటింది. 27 సంవత్సరాల పురాతన నౌకకు విజయవంతంగా మరమ్మతులు పూర్తిచేసింది.

పురాతన నౌకకు విజయవంతంగా మరమ్మతులు
మల్కాపురం, మార్చి 24: హిందుస్థాన్ షిప్‌యార్డు మరో మైలురాయిని దాటింది. 27 సంవత్సరాల పురాతన నౌకకు విజయవంతంగా మరమ్మతులు పూర్తిచేసింది. కొవిడ్ సమయంలో ఈ నౌకతో పాటు ఫిబ్రవరి 21, మార్చి 21న మరో రెండు నౌకల మరమ్మతులు పూర్తిచేసి ఘనత సొంతం చేసుకున్నామని యజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు నౌకల మరమ్మతులను పూర్తి నాణ్యతతో చేపట్టామని, ఇదే స్ఫూర్తితో బహుళ ప్రాజెక్టులను రూపొందించేందుకు హెచ్‌ఎస్‌ఎల్ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఇండియన్ నేవీ, కోస్టుగార్డులకు కూడా రక్షణ నౌకలను తయారుచేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వివరించింది.