సత్తాచాటిన జిల్లా విద్యార్థినులు

ABN , First Publish Date - 2021-10-07T06:20:19+05:30 IST

ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 26వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లా నుంచి వందలాది మంది హాజరయ్యారు.

సత్తాచాటిన జిల్లా విద్యార్థినులు

 ఐఐఐటీ ప్రవేశ పరీక్షలో 6, 11 ర్యాంకులు

విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 26వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లా నుంచి వందలాది మంది హాజరయ్యారు. కాగా, బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో పలువురు మెరుగైన ర్యాంకులను సాధించారు. జనరల్‌ మెరిట్‌ కేటగిరీలో కొమ్మాదిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో చదువుకున్న సింగం పల్లి శ్రీదేదీప్య ఆరో ర్యాంకు, చింతలవలస జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న రెడ్డి శృతిభాను 11వ ర్యాంకు సాధించారు. అలాగే పెందుర్తి నారాయణ విద్యార్థిని పొన్నాడ జయశ్రీ 18వ ర్యాంకు, పరవాడ డీఈ పాల్‌ స్కూల్స్‌ విద్యార్థిని ముత్తా దోరతి 19వ ర్యాంకు తెచ్చుకున్నారు. సోషల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ విభాగంలో 28వ ర్యాంకును నగరంలోని ఏపీఆర్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌లో చదువుతున్న కల్లూరి రోషన్‌లాల్‌ సాధించాడు. అదేవిధంగా చినగదిలి నారాయణ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చదువుతున్న రావులపల్లి సాయి పవన్‌ 16వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. 20 వేల లోపు 1,772 మంది ర్యాంకులు తెచ్చుకున్నారు. 

Updated Date - 2021-10-07T06:20:19+05:30 IST