పట్టాలమ్మ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-10-29T05:51:13+05:30 IST

పాములవాక గ్రామంలోని పట్టాలమ్మ నవదుర్గల అంకాలమ్మ ఆలయం ఆవరణలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన పలు విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది.

పట్టాలమ్మ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ
ఆలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్న స్వరూపానందేంద్ర సరస్వతి

విశిష్టఅతిథిగా హాజరైన శారదా పీఠాధిపతి


కోటవురట్ల, అక్టోబరు 28: పాములవాక గ్రామంలోని పట్టాలమ్మ నవదుర్గల అంకాలమ్మ ఆలయం ఆవరణలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన పలు విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానంద్రేంద్ర సరస్వతి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. దేవస్థానం ధర్మకర్త ఎస్‌వీ రమణ నేతృత్వంలో సుమారు రూ.20 లక్షలు వెచ్చించి అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, మహాశివలింగం, మహానంది, తదితర విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే వేచలపు శ్రీరామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T05:51:13+05:30 IST