పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-10-31T06:13:52+05:30 IST

నగరంలో పారిశుధ్య నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇస్తానని మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నూతన కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా అన్నారు.

పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యం
బాధ్యతలు స్వీకరించిన నూతన కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా

జీవీఎంసీ నూతన కమిషనర్‌ లక్ష్మీషా

నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా


విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్య నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇస్తానని మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నూతన కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా అన్నారు. శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం తనకు పూర్తిగా కొత్త అయినప్పటికీ...అన్నింటినీ ఆకళింపు చేసుకుని నగర అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి బాట పట్టిస్తానని, ప్రజా ప్రతినిధులు, నగరవాసుల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కృషిచేస్తానన్నారు. లోటు బడ్జెట్‌తోపాటు అనేక అంశాలపై ఉన్నతాధికారులు చర్చించి, అధ్యయనం చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తనను జీవీఎంసీ కమిషనర్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీషాకు మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారితోపాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు. 

Updated Date - 2021-10-31T06:13:52+05:30 IST