అప్పన్నకు సహస్రనామార్చన
ABN , First Publish Date - 2021-10-20T06:31:37+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామికి మంగళవారం సంప్రదాయబద్ధంగా సహస్రనామార్చన జరిపారు. ఆర్జిత సేవల్లో భాగంగా ప్రభాత సేవల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని భూదేవి, నీలాదేవి సమేతంగా కల్యాణమండపంలో రజిత వేదికపై అధిష్ఠింపజేశారు.

సింహాచలం, అక్టోబరు 19: వరాహలక్ష్మీనృసింహస్వామికి మంగళవారం సంప్రదాయబద్ధంగా సహస్రనామార్చన జరిపారు. ఆర్జిత సేవల్లో భాగంగా ప్రభాత సేవల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని భూదేవి, నీలాదేవి సమేతంగా కల్యాణమండపంలో రజిత వేదికపై అధిష్ఠింపజేశారు. నృసింహ సహస్రనామావళితో స్వామికి ప్రీతికరమైన తులసీ దళాలతో అర్చనలు చేశారు. అదే వేదికపై సింహాద్రినాథునికి ఆర్జిత నిత్యకల్యాణం, గరుడసేవలను నిర్వహించారు. భక్తులకు నిబంధనల ప్రకారం వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
చందన సమర్పణకు విరాళం
వరాహలక్ష్మీనృసింహస్వామికి ఏడాది పొడవునా పైపూతగా ఉంచే చందన సమర్పణకు హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన బుల్లితెర నిర్మాత కడియాల ప్రవీణ్ కుమార్ రూ.10,116లు ఏఈఓ కేకే రాఘవ కుమార్కు మంగళవారం అందజేశారు. ఆలయ నిబంధనల ప్రకారం దాతకు 200 గ్రాముల బరువుగల గంధపు కిల్లా (ముక్క)ను అందజేశారు.