గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బ్రాండిక్స్‌ వంటి సంస్థలు అవసరం

ABN , First Publish Date - 2021-10-20T06:30:50+05:30 IST

భారత్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బ్రాండిక్స్‌ వంటి మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కావాలని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి ఆర్‌వీ సుబ్రహ్మణ్యం అన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బ్రాండిక్స్‌ వంటి సంస్థలు అవసరం
బ్రాండిక్స్‌ను పరిశీలిస్తున్న సుబ్రహ్మణ్యం, చిత్రంలో దొరస్వామి


 కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం

అచ్యుతాపురం, అక్టోబరు 19 : భారత్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బ్రాండిక్స్‌ వంటి మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కావాలని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి ఆర్‌వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఇక్కడి బ్రాండిక్స్‌ ఆవరణలో గల వివిధ కర్మాగారాలను  మంగళవారం ఆయన సందర్శించారు. దుస్తుల తయారీని పరిశీలించారు. తయారైన దుస్తులు ఏఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. కర్మాగారంలో పనిచేస్తున్న పలువురు మహిళలతో మాట్లాడి బ్రాండిక్‌ ్స వల్ల కలిగిన ఉపయోగాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేవలం ఏడో తరగతి చదువుకున్న గ్రామీణ ప్రాంతాలకు చెందిన సుమారు 22 వేల మంది మహిళలకు ఒకేచోట అంతర్జాతీయ సౌకర్యాలతో ఉపాధి కల్పించామని బ్రాండిక్స్‌ భారత భాగస్వామి దొరస్వామి ఆయనకు వివరించారు. అలాగే ఈ ప్రాంతంలోని గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెజ్‌ జాయింట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ కిరణ్‌, ప్రసన్నకుమార్‌, శర్వానంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:30:50+05:30 IST