ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆవిర్భావ దినోత్సం

ABN , First Publish Date - 2021-07-12T05:36:32+05:30 IST

ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆవిర్భావ దినోత్సం
జెండా ఆవిష్కరణ అనంతరం నినాదాలు చేస్తున్న కార్మికులు


నర్సీపట్నం, జూలై 11 : ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. విశాఖ రీజియన్‌ రూరల్‌ డివిజన్‌ కార్యదర్శి వై.రాము ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎంవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు యూనియన్‌ నిరంతరం పోరాటం సాగిస్తున్నట్టు చెప్పారు. ఏఐటీయూసీ నాయకుడు ఎల్‌వీ రమణ, సీపీఐ నాయకుడు మాకిరెడ్డి రామానాయుడు, డీసీహెచ్‌ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T05:36:32+05:30 IST