విశాఖ : ఆగివున్న ట్యాంకర్‌ను ఢీ కొన్న వ్యాన్.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-08-25T13:27:02+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని గాజువాక షీలానగర్‌ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగదింది.

విశాఖ : ఆగివున్న ట్యాంకర్‌ను ఢీ కొన్న వ్యాన్.. ఇద్దరి మృతి

విశాఖపట్నం : జిల్లాలోని గాజువాక షీలానగర్‌ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగదింది. ఆగివున్న ట్యాంకర్‌ను వ్యాన్ ఢీకొన్నది. దీంతో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను హేమంత్, ప్రసాద్‌‌గా పోలీసులు గుర్తించారు. కాగా.. మృతులిద్దరూ విజయనగరం జిల్లా వాసులు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-08-25T13:27:02+05:30 IST