ఘనంగా గీతం స్నాతకోత్సం

ABN , First Publish Date - 2021-08-21T05:19:58+05:30 IST

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం జిమ్‌సర్‌ ఆడిటోరియంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కులపతి డాక్టర్‌ వీరేంద్ర సింగ్‌చౌహాన్‌ ి స్నాతకోత్సవ పట్టాలను అందించారు.

ఘనంగా గీతం స్నాతకోత్సం
స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న గీతం ఉపకులపది వీరేంద్రసింగ్‌ చౌహాన్‌

హాజరైన కులపతి డాక్టర్‌ వీరేంద్ర సింగ్‌ చౌహాన్‌ 

3,463 మందికి పట్టాలు... 32 మందికి బంగారు పతకాల ప్రదానం  

ఎండాడ, ఆగస్టు 20: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం జిమ్‌సర్‌ ఆడిటోరియంలో  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కులపతి డాక్టర్‌ వీరేంద్ర సింగ్‌చౌహాన్‌ ి స్నాతకోత్సవ పట్టాలను అందించారు. ఉత్తమ సిద్ధాంత వ్యాసంగా (పీహెచ్‌డీ) టెక్కలి ఆదిత్య కళాశాల ఈసీఈ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.శిరీష్‌కుమార్‌ అవార్డు అందుకున్నారు. 

గీతంలో కొత్తగా 14 పీజీ కోర్సులు 

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయ అనుబంధ వైద్య కళాశాల జిమ్‌సర్‌లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి 14 పీజీ కోర్సులను ప్రారంభించేందుకు ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి ఇచ్చిందని ఉప కులపతి ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ తెలిపారు. యువ పరిశోధకులను ప్రోత్సహించడానికి గీతం సీడ్‌ గ్రాంట్‌ పేరుతో  నిధులు కేటాయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రొ వైస్‌ చాన్సలర్‌లు డాక్టర్‌ సీవీరావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌వరియార్‌, ప్రొఫెసర్‌ శివప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌, అకడమిక్‌ డీన్‌లు, డైరెక్టర్లు స్నాతకోత్సవ నడకలో (అకడమిక్‌ ప్రొసెషన్‌) పాల్గొనగా,  గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.గంగాధరరావు,  కార్యదర్శి భరద్వాజ్‌, డాక్టర్‌ రవిరాజు, హంస కె.మెహదీ తదితరులు హాజరయ్యారు. విశాఖ ప్రాంగణం నుంచి 2020-21 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, లా, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, ఎంబీఏ, బీకాం కోర్సులు పూర్తి చేసిన 3,379 మంది పట్టభద్రులకు స్నాతకోత్తర డిగ్రీలను, 84 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్‌లు (పీహెచ్‌డీ), 32 మంది అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. 


Updated Date - 2021-08-21T05:19:58+05:30 IST