రెవెన్యూ సమస్య పరిష్కారం
ABN , First Publish Date - 2021-05-14T05:07:15+05:30 IST
రెవెన్యూ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజయ్‌కలాం వ్యక్తిగత కార్యదర్శి శ్రీదేవి అమరావతి నుంచి జైతవరం గ్రామానికి గురువారం వచ్చారు.
అమరావతి నుంచి వచ్చి భూమిని అప్పగించిన వైనం
చీడికాడ, మే 13: రెవెన్యూ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజయ్‌కలాం వ్యక్తిగత కార్యదర్శి శ్రీదేవి అమరావతి నుంచి జైతవరం గ్రామానికి గురువారం వచ్చారు. మండలంలోని జైతవరం గ్రామంలో సర్వే నంబర్లు 320/1, 321/1లో భూమిని రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో ఆమె సర్వే చేయించారు. అనంతరం ఆ భూమిని అసలైన లబ్ధిదారునికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే..
మండలంలో జైతవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 320/1లో 26 సెంట్లు, 321/1లో 25 సెంట్లు మెట్టు భూమిని.. సర్వే నంబరు 327/1లో 2.87 ఎకరాల పల్లం డిఫారం భూముని గ్రామానికి చెందిన మొల్లి పెదఅప్పన్నకు 50సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చింది. నాలుగేళ్ల క్రితం అప్పన్న, ఆయన కుమారుడు దేముడు మృతిచెందారు. అయితే ఆ భూములను అదే గ్రామానికి చెందిన రెడ్డి అప్పలనాయుడు, రెడ్డి సత్యారావు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన భూమిని తనకు అప్పగించాలని కోరుతూ మొల్లి దేముడు భార్య నూకాలమ్మ 2017 నుంచి విశాఖపట్నం స్పందనకు మూడు పర్యాయాలు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు కాపీ ఆరు నెలల క్రితం అమరావతి రెవెన్యూ శాఖకు వెళ్లింది. దీనిపై ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు అజయ్‌కలాం తన వ్యక్తిగత కార్యదర్శి శ్రీదేవిని పంపించి, బాధితురాలికి న్యాయం చేయమని ఆదేశించారు. దీంతో శ్రీదేవి, రెవెన్యూ, పోలీసుల సమక్షంలో గురువారం జైతవరం గ్రామంలోని భూమిని సర్వే చేయించి, నూకాలమ్మకు 51 సెంట్లు భూమిని అప్పగించారు. మిగిలిన 2.82 ఎకరాల భూమికి సంబంధించి కోర్టులో వివాదం ఉన్నందున దాన్ని సర్వే చేయలేదని మండల సర్వేయర్ కుమారస్వామి తెలిపారు. రాష్ట్రస్థాయి అధికారి గ్రామానికి వచ్చి బాధితురాలికి అండగా నిలవడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.