అయ్యప్పస్వామి ఆలయంలో అన్నసమారాధన పునః ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-21T06:02:01+05:30 IST

షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయంలో మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిత్యాన్న సమారాధన కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు.

అయ్యప్పస్వామి ఆలయంలో అన్నసమారాధన పునః ప్రారంభం
అన్నసమారాధనలో పాల్గొన్న భక్తులు

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 20: షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయంలో మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిత్యాన్న సమారాధన కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది మే నెలలో నిలిపివేసిన ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షుడు చరపాక నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆలయంలో అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు నంబారు రాజు, విశ్వేశ్వరరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T06:02:01+05:30 IST