కార్మికులందరిపై ఉక్కు కర్మాగార పరిరక్షణ బాధ్యత

ABN , First Publish Date - 2021-06-18T04:45:56+05:30 IST

ఆంధ్రుల ఆత్మ గౌరవమైన ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకొనే బాధ్యత ప్రతి కార్మికునిపై ఉందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం 126వ రోజు గురువారం ఎస్‌ఎంఎస్‌ విభాగాలకుచెందిన కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ ద్వారా ఉక్కు కర్మాగారం అంశాలను కోరి న వ్యక్తికి కేంద్రం ఇచ్చిన సమాధానం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కార్మికులందరిపై ఉక్కు కర్మాగార పరిరక్షణ బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న అయోధ్యరామ్‌

 ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌  

కూర్మన్నపాలెం, జూన్‌ 5: ఆంధ్రుల ఆత్మ గౌరవమైన ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకొనే బాధ్యత ప్రతి కార్మికునిపై ఉందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. ఉక్కు  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం 126వ రోజు గురువారం ఎస్‌ఎంఎస్‌ విభాగాలకుచెందిన కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ ద్వారా ఉక్కు కర్మాగారం అంశాలను కోరి న వ్యక్తికి కేంద్రం ఇచ్చిన సమాధానం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశ రక్షణ పరంగా విశాఖ నగరానికి ఎం తో ప్రాముఖ్యత ఉండడడంతో నాటి యుద్ధంలో పాకిస్థాన్‌ విశాఖను ఆక్రమించాలని చూసి భంగపడిందన్నారు. అంతటి ప్రాధాన్యం కలిగిన విశాఖ నగర ఆత్మగౌరవమైన ఉక్కు కర్మాగారాన్ని ఐక్య పోరాటాలతో ప్రభుత్వ రంగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీయులకు ఉక్కు కర్మాగారం కట్టబెడితే  సహించేది లేదన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడమే మోదీ ధ్యేయంగా మారిందని, ప్రజలంతా ఐక్యంగా ఇలాంటి చర్యలను ప్రతిఘటిస్తేనే  దేశ సంపదను పరిరక్షించుకోవడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గద్దెనెక్కి కార్పొరేట్లకు ఊడి గం చేయటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఉక్కుకు సొంత గనులు కేటాయించాలన్నారు. స్టీలుప్లాం టు ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  


అనంతరం పోరాట కమిటీ కో కన్వీనర్‌ కె.సత్యనారాయణ మాట్లాడుతూ ఐకమత్యంతో, దేశాన్ని మన ఉక్కు పరిశ్రమను కార్మికులు అందరూ మోదీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు నిజాయితీతో పోరాటాలు చేయాలని, రాజీ డ్రామాలు వద్దన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని, ఉక్కు కార్మికులకు రాష్ట్ర ప్రజలు అందరూ తోడుగా ఉంటారన్నారు.


ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు గంధం వెంకటరావు, వరసాల శ్రీనివాసరావు, అప్పారావు, తౌడన్న, రమణ, పూర్ణచంద్రరావు, కృష్ణమూర్తి, బంగారునాయుడు, ముత్యాలునాయుడు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:45:56+05:30 IST