సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-12-26T04:15:05+05:30 IST

సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రతీ హిందువు తప్పనిసరిగా తెలుసుకోవాలని బాల త్రిపుర సుందరి పీఠ భగ కళాముక పీఠాధిపతి కపిలేశ్వరానందగిరి స్వామిజీ సూచించారు.

సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన అవసరం
మేలుకొలుపు కార్యక్రమంలో పాల్గొన్న కపిలేశ్వరానందగిరి స్వామిజీ

పరవాడ, డిసెంబరు 25: సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రతీ హిందువు తప్పనిసరిగా తెలుసుకోవాలని బాల త్రిపుర సుందరి పీఠ భగ కళాముక పీఠాధిపతి కపిలేశ్వరానందగిరి స్వామిజీ సూచించారు. సమర సత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పరవాడలో నిర్వహిస్తున్న మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ హనుమాన్‌ చాలీసా, శివనామ పారాయణం చేయాలన్నారు. అనంతరం సీతారామ పల్లకీ ఊరేగింపులో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సిరపురపు అప్పలనాయుడు, ఉపసర్పంచ్‌ బండారు రామారావు, సమర సత సేవా ఫౌండేషన్‌ మండల కన్వీనర్‌ చిరికి అప్పారావు, సహ కన్వీనర్‌ ఎం.నాగపేర్రాజ్‌, ఉప మండల కన్వీనర్‌ వానపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T04:15:05+05:30 IST