తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2021-12-30T06:08:32+05:30 IST

మన్యంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బుధవారం చింతపల్లిలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌ వాతావరణ విభాగం ఆర్‌ఏ డాక్టర్‌ సౌజన్య తెలిపారు. గత రెండు మూడు రోజుల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో స్థానికులు ఒకింత ఉపశమనం చెందారు. బుధవారం ఒక్కసారిగి ఐదు డిగ్రీలు తగ్గడంతో చలికి గజగజలాడుతున్నారు. మంచు దట్టంగా కురుస్తున్నది.

తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
చింతపల్లిలో కురుస్తున్న మంచు

చింతపల్లిలో 10.5 డిగ్రీలు


చింతపల్లి, డిసెంబరు 29: మన్యంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బుధవారం చింతపల్లిలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌ వాతావరణ విభాగం ఆర్‌ఏ డాక్టర్‌ సౌజన్య తెలిపారు. గత రెండు మూడు రోజుల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో స్థానికులు ఒకింత ఉపశమనం చెందారు. బుధవారం ఒక్కసారిగి ఐదు డిగ్రీలు తగ్గడంతో  చలికి గజగజలాడుతున్నారు. మంచు దట్టంగా కురుస్తున్నది.


మంచు ముసుగులో సీలేరు

సీలేరు, డిసెంబరు 29: సీలేరులో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. చలి తీవ్రత కూడా అధికంగా వుండడంతో ప్రజల దినచర్యకు ఆటంకం ఏర్పడింది. కాగా సీలేరుకు పర్యాటల తాకిడి పెరిగింది.


Updated Date - 2021-12-30T06:08:32+05:30 IST