మిత్ర బృందంతో అల్లూరి పార్కును సందర్శించిన ఆర్డీవో

ABN , First Publish Date - 2021-10-14T06:18:11+05:30 IST

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి సీతారామరాజు పార్కును నర్సీపట్నం ఆర్డీవో రోణంకి గోవిందరావు, తన మిత్రబృందంతో కలిసి బుధవారం సందర్శించారు.

మిత్ర బృందంతో అల్లూరి పార్కును సందర్శించిన ఆర్డీవో
మిత్రులతో కలిసి అల్లూరి విగ్రహం వద్ద ఆర్డీవో నివాళి


కృష్ణాదేవిపేట, అక్టోబరు 13 : గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి సీతారామరాజు పార్కును నర్సీపట్నం ఆర్డీవో రోణంకి గోవిందరావు, తన మిత్రబృందంతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అల్లూరి, గంటందొరల సమాధుల వద్ద నివాళులర్పించారు.   పార్కు మరింత అభివృద్ధి చెందేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. అలాగే, ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు పార్కు సంరక్షకులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పార్కును సహోపాధ్యాయ విత్రులతో సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.   

Updated Date - 2021-10-14T06:18:11+05:30 IST