రాణీచంద్రమణీదేవి ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స
ABN , First Publish Date - 2021-05-22T04:16:33+05:30 IST
రాణీచంద్రమణీదేవి ఆస్పత్రిలో 30 పడకలతో కొవిడ్ వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.

నేటి నుంచి అందుబాటులోకి రానున్న 30 పడకలు
విశాఖపట్నం, మే 21: రాణీచంద్రమణీదేవి ఆస్పత్రిలో 30 పడకలతో కొవిడ్ వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పెదవాల్తేరులోని ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం నుంచి చికిత్స అందుబాటులోకి రావాలన్నారు. ఆస్పత్రిలో ఆక్జిన్ ప్లాంట్ ఏర్పాటుతోపాటు ఆక్సిజన్ సదుపాయం ఉన్న రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అనంతరం రీజనల్ కంటి ఆస్పత్రిని సందర్శించి అక్కడి వైద్య పరిస్థితులు తెలుసుకున్నారు.