హెటెరో పైపులైన్ తొలగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ABN , First Publish Date - 2021-12-09T05:47:25+05:30 IST
హెటెరో ఔషధ కంపెనీ అక్రమంగా వేస్తున్న పైపులైన్‌ను వెంటనే తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మత్స్యకారులు హెచ్చరించారు.

రాజయ్యపేట మత్స్యకారులు హెచ్చరిక
నక్కపల్లి, డిసెంబరు 8: హెటెరో ఔషధ కంపెనీ అక్రమంగా వేస్తున్న పైపులైన్‌ను వెంటనే తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. వ్యర్థ జలాలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి పైపులైన్ వేయవద్దంటూ రాజయ్యపేట మత్స్యకారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నెత్తిపై సమ్తనా(టోపీ)తో వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కంబాల అమ్మోరియ్య, సీపీఎం జిల్లా నాయకుడు ఎం.అప్పలరాజు, మత్స్యకార నాయకులు మేరుగు కొర్లయ్య, మైలపల్లి గిరీశ్, పిక్కి గంగరాజు, స్వామి, గోసల స్వామి, వాసిపిల్లి నూకరాజు, పిక్కి కోదండరావు, కోడ జగదీశ్, దైలపల్లి శ్రీను, మడదా నాగేశ్, తదితరులు పాల్గొన్నారు.