రాచపల్లి భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగిచాలి

ABN , First Publish Date - 2021-12-15T05:59:16+05:30 IST

మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 500 ఎకరాలు భూములు ఏపీఐఐసీ రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ మంగళవారం ఆర్డీవో గోవిందరావుని కోరారు.

రాచపల్లి భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగిచాలి
ఎమ్మెల్యే సమక్షంలో ఆర్డీవో గోవిందరావుకి వినతి పత్రం అందజేస్తున్న రాచపల్లి రెవెన్యూ పరిధి రైతులు

రాచపల్లి భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగిచాలి

రైతుల తరపున ఆర్డీవోకి ఎమ్మెల్యే గణేశ్‌ వినతి


నర్సీపట్నం, డిసెంబరు 14: మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 500 ఎకరాలు భూములు ఏపీఐఐసీ రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ మంగళవారం ఆర్డీవో గోవిందరావుని కోరారు.  రాచపల్లి రెవెన్యూ పరిధిలోని పలువురు రైతులు తొలుత ఎమ్మెల్యేని కలిసి తమ భూముల సమస్యను వివరించారు. అనంతరం అందరూ కలిసి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. రాచపల్లి, రామన్నపాలెం, ఎరకన్నపాలెం, ధర్మవరం గ్రామాలకు చెందిన భూములు ఏపీఐఐసీ రికార్డుల్లో ఉండడంతో భూముల క్రయవిక్రయాలకు వీలుకాక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గణేశ్‌ చెప్పారు. ఆయా భూములను ఏపీఐఐసీ రికార్డుల్లో నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆర్డీవోని కోరారు. అనంతరం రైతులంతా కలిసి ఆర్డీవో గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసు, పెట్ల భద్రాచలం, దొరబాబు, జమీందారు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-15T05:59:16+05:30 IST