పరవాడలో స్వచ్ఛ సంకల్పం ర్యాలీ

ABN , First Publish Date - 2021-08-10T05:48:14+05:30 IST

పరవాడలో సోమవారం జగనన్న స్వచ్ఛ సంకల్పం ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో వి.హేమసుందరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు.

పరవాడలో  స్వచ్ఛ సంకల్పం ర్యాలీ
పరవాడలో నిర్వహిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం ర్యాలీ

పరవాడ, ఆగస్టు 9: పరవాడలో సోమవారం జగనన్న  స్వచ్ఛ సంకల్పం ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో వి.హేమసుందరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ప్రారంభమై పోస్టాఫీస్‌ వీధి వరకు కొనసాగింది. అంతకు ముందు మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో స్వచ్ఛ సమ్మేళనం అనే అంశంపై అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం గొర్లె సాయిరమేశ్‌, పంచాయతీ కార్యదర్శులు అచ్యుతరావు, మల్లికార్జునరావు, ప్రసన్నకుమార్‌, మురళి, లక్ష్మణరావు, రమేశ్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

సబ్బవరంలో..

సబ్బవరం: గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే  ఆర్థికాభివృద్ధి సాఽధ్యమని డీపీఆర్‌సీ( డిస్ట్రిక్ట్‌ పంచాయతీ రిసోర్స్‌ సెంటర్‌) జిల్లా కో-ఆర్డినేటర్‌ చంద్రకళ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై కార్యదర్శులు, వలంటీర్లు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందులో మహిళా సంఘాల సభ్యులు, వలంటీర్లు కీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను స్వీకరించి హరిత రాయబారుల ద్వారా కేంద్రాలకు పంపాలని సూచించారు. అనంతరం సబ్బవరం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో రమేశ్‌నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ ఓ.మహేశ్‌, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ హిమబిందు, ఏపీవో బీవీ రమణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-10T05:48:14+05:30 IST