ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-07-08T06:33:59+05:30 IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సభలో మాట్లాడుతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఆనందపురం, జూలై 7: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండలంలోని మామిడిలోవ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం శొంఠ్యాం పంచాయతీలో జగనన్న ఇళ్ల కాలనీలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభల్లో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అర్హతలుండి తొలివిడతలో జగనన్న ఇళ్ల స్థలాలు అందుకోనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. స్థానికంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించి అర్హుల జాబితాను రూపొందిస్తే ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పంచాయతీలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రాలను గాంధీ జయంతి నాటికి పూర్తిచేసి వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాకర్లపూడి వరహాలరాజు, కోరాడ వెంకటరావు, మజ్జి వెంకటరావు, బి.మణిశంకర్‌నాయుడు, గండ్రెడ్డి శ్రీనివాసరావు, బీఆర్‌బీ నాయుడు, సర్పంచ్‌లు మల్లికార్జునరావు, సుజాత, మహేశ్‌, లెంక రాంబాబు, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-08T06:33:59+05:30 IST