వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

ABN , First Publish Date - 2021-12-19T05:49:06+05:30 IST

వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.

వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
ఆత్మగౌరవ సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి


మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

చింతపల్లి, డిసెంబరు 18: వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. శనివారం  లంబసింగి జంక్షన్‌లో ఆత్మగౌరవ సభ జరిగింది. ఈకార్యక్రమానికి హాజరైన ఈశ్వరి మాట్లాడుతూ.. ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వారం రోజుల్లో సీపీఎస్‌ని రద్దుచేస్తామని ప్రకటించిన జగన్‌ మూడేళ్లు గడుస్తున్న కనీసం ప్రాథమిక చర్యలు కూడా ప్రారంభించలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరుచేసిన గృహాలకు ఓటీఎస్‌ పేరిట దోపిడీకి శ్రీకారం చుట్టారన్నారు. గిరిజన ప్రాంతంలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయిందన్నారు. నెలల తరబడి గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలకు బిల్లులు చెల్లించడంలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిముడు లక్ష్మయ్య, సరమండ శ్రీధర్‌, బోనంగి పోతురాజు పడాల్‌, పాంగి రాము, రమణ పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-19T05:49:06+05:30 IST