పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

ABN , First Publish Date - 2021-10-29T05:49:07+05:30 IST

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే బాలల దినోత్సవం బ్రోచర్‌ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ గురువారం ఆవిష్కరించారు.

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
పీఆర్‌టీయూ బాలదినోత్సవ బ్రోచర్‌ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌

బ్రోచర్‌ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గణేశ్‌


నర్సీపట్నం, అక్టోబరు 28: పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే బాలల దినోత్సవం బ్రోచర్‌ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీనాథ్‌ మాట్లాడుతూ, బాలల దినోత్సవం సందర్భంగా డివిజన్‌స్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంట్రీ ఫారాలు అందజేయాలని అన్నారు. నవంబరు 1న చిత్రలేఖనం, 10న బృందగానం, 11న క్విజ్‌, 11న పద్య పఠనం, 13న విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. 14న సిటీ క్లబ్‌ ఆవరణలో బాలల దినోత్సవ, బహుమతి ప్రదానం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అల్లు అప్పారావు, బాబీ మాస్టారు, రవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T05:49:07+05:30 IST