ఘనంగా గంగాదేవి విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-08-22T05:03:39+05:30 IST

మండలంలోని జోగంపేటలో గంగాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. పైల ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ సుర్ల బాబ్జి, గ్రామస్థుల ఆర్థిక సహాయంతో ఆలయం నిర్మించారు. మూడు రోజులపాటు హోమం నిర్వహించి గంగాదేవి విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం ప్రతిష్ఠించారు.

ఘనంగా గంగాదేవి విగ్రహ ప్రతిష్ఠ
జోగంపేటలో గంగాదేవిని దర్శించుకుంటున్న మాజీ మంత్రి అయ్యన్న

గొలుగొండ, ఆగస్టు 21: మండలంలోని జోగంపేటలో గంగాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. పైల ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ సుర్ల బాబ్జి, గ్రామస్థుల ఆర్థిక సహాయంతో  ఆలయం నిర్మించారు. మూడు రోజులపాటు హోమం నిర్వహించి గంగాదేవి విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, నర్సీపట్నం మునిసిపల్‌ కౌన్సిలర్‌ చింతకాయల రాజేష్‌, ధనిమిరెడ్డి ముధు, తారకవేణుగోపాల్‌,  అప్పలనాయుడు  అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన చేపట్టారు.


Updated Date - 2021-08-22T05:03:39+05:30 IST