ఘనంగా ముత్యాలమ్మ సారె ఊరేగింపు

ABN , First Publish Date - 2021-02-26T05:49:01+05:30 IST

మండల కేంద్రంలో గురువారం ముత్యాలమ్మ సారె ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం అమ్మవారి పండగ జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు.

ఘనంగా ముత్యాలమ్మ సారె ఊరేగింపు
ముత్యాలమ్మ సారె ఊరేగిస్తున్న భక్తులు

కశింకోట, ఫిబ్రవరి 25: మండల కేంద్రంలో గురువారం ముత్యాలమ్మ సారె ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం అమ్మవారి పండగ జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఈ సందర్భంగా భక్తులు పండ్లు, పిండి వంటలు పళ్లాల్లో పెట్టి గ్రామ పురవీధుల్లో ఊరేగారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు శిష్టి రాజు, చేబ్రోలు బ్రహ్మం, మరిసా గోవింద, శివ, బొబ్బబరి మహేశ్‌, ద్వారపురెడ్డి శ్రీను, వెంకటఅప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:49:01+05:30 IST