ఘనంగా ఎమ్మెల్యే వెలగపూడి జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-06-23T05:32:29+05:30 IST
తూర్పు నియోజకవర్గం శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలను మంగళవారం గ్రేటర్ విశాఖ 23వ వార్డు కనకమ్మమెట్ట మీద ఘనం గా నిర్వహించారు.
సీతమ్మధార, జూన్ 22: తూర్పు నియోజకవర్గం శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలను మంగళవారం గ్రేటర్ విశాఖ 23వ వార్డు కనకమ్మమెట్ట మీద ఘనం గా నిర్వహించారు. పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం సీనియర్ నాయకుడు బోస రాంబాబు, వార్డు అధ్యక్షుడు గోలగాని పురుషోత్తం, అర్బన్ జిల్లా మైనారిటీ సెల్ ఉపాఽధ్యక్షుడు మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో పేదలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువత చల్లా నూకరాజు, వార్డు ఉపాఽధ్యక్షుడు బోస పోతన్నరెడ్డి, పుతి వరప్రసాద్ రెడ్డి, వార్డు మహిళా అధ్యక్షురాలు కాకి వేణుభాయ్, బోగిది అప్పలరాజు, సాడి అప్పలరాజు, కనకాల గణేష్, సాడి శివకుమార్, టెంటు నాయుడు, కనకరాజు, కార్యకర్తలు, పాల్గొన్నారు.