‘లేటరైట్‌’కు వ్యతిరేకంగా సరుగుడులో నిరసన

ABN , First Publish Date - 2021-07-24T06:08:36+05:30 IST

లేటరైట్‌ అనుమతులకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో నాతవరం మండలం సరుగుడు సంతలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

‘లేటరైట్‌’కు వ్యతిరేకంగా సరుగుడులో నిరసన
లేటరైట్‌కు వ్యతిరేకంగా సంతలో నినాదాలు చేస్తున్న గిరిజనులు, సీపీఎం శ్రేణులు

 లీజు రద్దు చేసి, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌

నర్సీపట్నం, జూలై 23 : లేటరైట్‌ అనుమతులకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో నాతవరం మండలం సరుగుడు సంతలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ ప్రభుత్వం లేటరైట్‌ అనుమతులు రద్దు చేసే వరకు గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. లేటరైట్‌ లీజు రద్దు చేసి, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేటరైట్‌ తవ్వకాల వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో రావుల కాసుబాబు, అబ్బాయి, వెంకటేశ్‌, గిరిజన సంఘం నాయకుడు కె.నాగరాజులతో పాటు పలువురు గిరి జనులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:08:36+05:30 IST