సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌

ABN , First Publish Date - 2021-12-19T06:03:59+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ మొదలైంది.

సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌

విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ మొదలైంది. సచివాలయాల్లో మొత్తం 14 శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకోవడంతోపాటు నిబంధనలకు లోబడి డిపార్టుమెంటల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఇస్తారు. ఇప్పటికే కొన్ని శాఖల నుంచి కలెక్టర్‌కు జాబితాలు అందాయి. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 574 మంది వెల్ఫేర్‌ అసిస్టెంట్లకుగాను 343 మందికి ప్రొబేషనరీ ఖరారు చేశారు. మిగిలిన శాఖల నుంచి అర్హుల జాబితాలను సంబంధిత అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. 

Updated Date - 2021-12-19T06:03:59+05:30 IST