రుషికేశ్‌లో శారదా పీఠాధిపతిని కలిసిన దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

ABN , First Publish Date - 2021-08-22T04:46:00+05:30 IST

రుషికేశ్‌లో చాతుర్మాస్య దీక్షలో వున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్రను శనివారం రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌ కలిశారు.

రుషికేశ్‌లో శారదా పీఠాధిపతిని కలిసిన దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
వాణీమోహన్‌కు దుశ్శాలువ అందజేస్తున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

పెందుర్తి రూరల్‌, ఆగస్టు 21: రుషికేశ్‌లో చాతుర్మాస్య దీక్షలో వున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్రను శనివారం రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌ కలిశారు. ఆమెకు స్వరూపానందేంద్ర దుశ్శాలువా ఇచ్చి ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆమె దేవదాయ శాఖకు సంబంధించిన పలు అంశాలను స్వరూపానందేంద్రతో చర్చించగా, ఆయన పలు సూచనలు చేశారు. ఆలయాల్లో అర్చకులకు కల్పించిన వంశపారంపర్య హక్కులకు సంబంధించిన చట్టాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం చర్యలు చేపట్టాలని సూచించారు.


Updated Date - 2021-08-22T04:46:00+05:30 IST