ప్రసన్నగిరిపై ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-01-14T05:05:36+05:30 IST

బీహెచ్‌పీవీ ప్రసన్నగిరిపై గల వెంకటేశ్వర వినాయక స్వామి దేవస్థానంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు బుధవారం గోదా శ్రీనివాస కల్యాణంతో వైభవంగా ముగిశాయి

ప్రసన్నగిరిపై ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు
గోదా శ్రీనివాస కల్యాణం

అక్కిరెడ్డిపాలెం: బీహెచ్‌పీవీ ప్రసన్నగిరిపై గల వెంకటేశ్వర వినాయక స్వామి దేవస్థానంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు బుధవారం గోదా శ్రీనివాస కల్యాణంతో వైభవంగా ముగిశాయి. దేవస్థానంలోని కల్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించబడిన వేదికపై గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని ప్రధానార్చకులు కె.వెంకట జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు హైందవ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T05:05:36+05:30 IST