ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ

ABN , First Publish Date - 2021-08-25T05:46:47+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుందని విద్యా శాఖ సంచాలకుడు వి.చినవీరభద్రుడు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ
విద్యార్థులతో మాట్లాడుతున్న చినవీరభద్రుడు, అధికారులు

విద్యా శాఖ సంచాలకుడు చినవీరభద్రుడు


అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 24: ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుందని విద్యా శాఖ సంచాలకుడు వి.చినవీరభద్రుడు చెప్పారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ శిక్షణా పరిశోధనా సంస్థ సంచాలకుడు ప్రతాప్‌రెడ్డితో కలిసి అనకాపల్లిలో అకస్మికంగా పర్యటించారు. జీవీఎంసీ బాలికోన్నత, రేబాక ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, ప్రాంగణం, పరిశుభ్రత, రికార్డులు, సంసిద్ధత, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, విద్యాకానుక కిట్లు, మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు తదితర అంశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారు చెప్పిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలను రూపొందించామన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు ఉండడంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు. ఆయన వెంట డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎంఈవో డి.దివాకర్‌, హెచ్‌ఎంలు పీఏఆర్‌వీ మహేశ్‌, హేమలత ఉన్నారు. అనంతరం బొజ్జన్నకొండ ప్రాంతాన్ని వారు సందర్శించారు. 

Updated Date - 2021-08-25T05:46:47+05:30 IST