ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో పోలమాంబ క్లబ్
ABN , First Publish Date - 2021-08-25T05:44:36+05:30 IST
జిల్లా ఫుట్‌బాల్ సంఘం నిర్వహిస్తున్న కొసరాజు చారిటబుల్ ట్రస్ట్ కప్ సీనియర్ ఫుట్‌బాల్ నాకౌట్ టోర్నీలో పోలమాంబ (చిట్టివలస) క్లబ్ ఫైనల్స్‌కు చేరింది. మంగళవారం ఏయూ గ్రౌండ్‌లో జరిగిన సమీఫైనల్స్‌లో పోలమాంబ 6-4 గోల్స్ తేడాతో ఆతిథ్య వైజాగ్ ఎఫ్‌సీ (కేసీటీ)పై విజయం సాధించింది.

విశాఖపట్నం (స్పోర్ట్సు), ఆగస్టు 24: జిల్లా ఫుట్‌బాల్ సంఘం నిర్వహిస్తున్న కొసరాజు చారిటబుల్ ట్రస్ట్ కప్ సీనియర్ ఫుట్‌బాల్ నాకౌట్ టోర్నీలో పోలమాంబ (చిట్టివలస) క్లబ్ ఫైనల్స్‌కు చేరింది. మంగళవారం ఏయూ గ్రౌండ్‌లో జరిగిన సమీఫైనల్స్‌లో పోలమాంబ 6-4 గోల్స్ తేడాతో ఆతిథ్య వైజాగ్ ఎఫ్‌సీ (కేసీటీ)పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరుజట్లు చెరో గోల్ చేసి మ్యాచ్‌ను డ్రా ముగించడంతో విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకర్ నిర్వహించారు. ఇందులో పోలమాంబ ఆటగాళ్లు రవికాంత్, కుమార్, అశ్విన్, ప్రసాద్, సంతోష్, ప్రసాద్ (6 గోల్స్) చేయగా, వైజాగ్ ఎఫ్‌సీలో కె.కృతు, ఐ.పవన్, కనక, ప్రదీప్ 4 గోల్స్ చేయడంతో పోలమాంబ జట్టు ఫైనల్‌కు చేరింది.