మొక్కలు మనకు నేస్తాలు

ABN , First Publish Date - 2021-03-22T05:57:39+05:30 IST

మొక్కలు మనకు నేస్తాలని, అవి మనకు ప్రాణ వాయువును అందించే వన దేవతలని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా అన్నారు.

మొక్కలు మనకు నేస్తాలు
మొక్క నాటి నీరు పోస్తున్న జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా

జూ క్యూరేటర్‌ నందనీ సలారియా

ఆరిలోవ, మార్చి 21: మొక్కలు మనకు నేస్తాలని, అవి మనకు ప్రాణ వాయువును అందించే వన దేవతలని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా అన్నారు. వాతావరణ సమతుల్యతను పెంపొందించడానికి మొక్కలు ఎంతో అవసరమన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం జూలోని ఏనుగుల మోటు వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవులను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నా యన్నారు. అడవులు వృద్ధి చెందితే అనేక రకాలు జంతువులకు నివాస యోగ్యాలుగా ఉంటాయన్నారు. మొక్కలను నరికివేసిన చోటే మరికొన్ని మొక్కలను నాటి అటవీ సంపదను పెంపొందిచాంలని విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి తన పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ క్యూరేటర్‌ ఉమామహేశ్వరి, ఓక్రిడ్జ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శైలజ బమిడిపాటి, అనిల్‌జైన్‌, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:57:39+05:30 IST