నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

ABN , First Publish Date - 2021-02-05T06:27:17+05:30 IST

పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా మైక్రో అబ్జర్వర్లు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్‌ సూచించారు.

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌

ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్‌ 

సిరిపురం, ఫిబ్రవరి 4: పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా మైక్రో అబ్జర్వర్లు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో గురువారం పంచాయతీ ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమితులైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియను నిశితంగా గమనించే బాధ్యతను మైక్రో అబ్జర్వర్లపై ఉంచిందన్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల కోసం పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నికను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎస్‌ఈసీ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం జారీ చేసిన నియమ నిబంధనలను, రిటర్నింగ్‌, ప్రొసీడింగ్‌ అధికారుల హ్యాండ్‌బుక్‌లను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. అనంతరం జడ్పీ సీఈవో నాగార్జునసాగర్‌ నియమ నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-05T06:27:17+05:30 IST