మానసికంగా దృఢంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం
ABN , First Publish Date - 2021-02-27T05:27:54+05:30 IST
సమాజంలో ప్రతివ్యక్తీ మానసికంగా దృఢంగా ఉండాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుధాకర్ అన్నారు. ఏయూ సైకాలజీ విభాగంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సైకోమెట్రిక్ ఎక్స్పో (వర్క్‌షాప్)ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కొవిడ్ సమయంలో సేవలందించిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు పరీక్షలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

కొవిడ్ సమయంలో వారియర్స్ అందించిన సేవలు నిరుపమానం
సైకోమెట్రిక్ ఎక్స్పో ప్రారంభ సభలో ఏఎంసీ ప్రిన్సిపాల్ సుధాకర్
ఏయూ క్యాంపస్, ఫిబ్రవరి 26: సమాజంలో ప్రతివ్యక్తీ మానసికంగా దృఢంగా ఉండాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుధాకర్ అన్నారు. ఏయూ సైకాలజీ విభాగంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సైకోమెట్రిక్ ఎక్స్పో (వర్క్‌షాప్)ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కొవిడ్ సమయంలో సేవలందించిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు పరీక్షలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సమస్యలను గుర్తించి, అధిగమించే ప్రయత్నం జరగాలని జీవీఎంసీ సీఎంవో డాక్టర్ శాస్ర్తి అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దన్నారు. ఏయూ సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు మాట్లాడుతూ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మానసిక ఒత్తిడిపై పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమమన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు రచించిన ఫీల్‌గుడ్ పుస్తకా న్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు, వైద్యులు కేఎస్ఎన్ మూర్తి, అర్జున్, రాధాకాంత్, వీజేఎఫ్ అధ్య క్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. అనంతరం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించారు.