పన్నులతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు
ABN , First Publish Date - 2021-12-26T05:39:49+05:30 IST
రాష్ట్రంలో వివిధ రకాల పన్నులతో ప్రజలు సీఎం జగన్ పీల్చి పిప్పు చేస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు వైఎన్ భద్రం అన్నారు.

సీపీఐ జిల్లా నాయకుడు భద్రం
అనకాపల్లి టౌన్, డిసెంబరు 25: రాష్ట్రంలో వివిధ రకాల పన్నులతో ప్రజలు సీఎం జగన్ పీల్చి పిప్పు చేస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు వైఎన్ భద్రం అన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయం వద్ద శనివారం పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ తాకాశి వెంకటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నేత భద్రం మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, కార్మిక సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిన ఘనత సీపీఐకి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాజకీయం చేస్తూ పేదవాడికి ఇల్లు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క వివిధ రకాల పన్నులతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ అందరి కంటే తన అధికారంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీరామదాసు అబ్బులు, మల్లికార్జునరావు, కోరిబిల్లి శంకరరావు, ఇంజరపు అంబికేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ, చవితిన నూకరాజు, దాసరి వాసు పాల్గొన్నారు.