ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
ABN , First Publish Date - 2021-07-08T06:11:16+05:30 IST
ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వగలిగిన నాడే ప్రజా రవాణా శాఖ(పీటీడీ)కి అత్యధిక ఆదరణ లభిస్తుందని పీటీడీ విశాఖ రీజనల్ మేనేజర్ ఎంవై దానం అన్నారు.

ఆర్‌ఎం ఎంవై దానం
ద్వారకాబస్‌స్టేషన్, జులై 7: ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వగలిగిన నాడే ప్రజా రవాణా శాఖ(పీటీడీ)కి అత్యధిక ఆదరణ లభిస్తుందని పీటీడీ విశాఖ రీజనల్ మేనేజర్ ఎంవై దానం అన్నారు. ప్రమాదరహిత డ్రైవింగ్ అంశంపై ద్వారకా కాంప్లెక్సులో బుధవారం ఏర్పాటు చేసిన డ్రైవర్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా రవాణా శాఖలో పనిచేసే డ్రైవర్లంతా సుశిక్షితులైన వారే అని, అందువల్ల రోడ్డు ప్రమాదాలకు ఎటువంటి ఆస్కారం లేదని, బస్సుల్లో ప్రయాణించే వారు సురక్షితంగా తమ గమ్యానికి చేరుకుంటారని అన్నారు. డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బి.అప్పలనాయుడు మాట్లాడుతూ డ్రైవింగ్‌లో జాగ్రత్త వహించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్(జిల్లా) సీహెచ్ అప్పలనారాయణ, డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్, రీజియన్‌లో పది డిపోల్లో ఎంపిక చేసిన డ్రైవర్లు పాల్గొన్నారు.