పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుయువత కార్యవర్గం
ABN , First Publish Date - 2021-12-31T06:22:49+05:30 IST
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుయువత కార్యవర్గాన్ని గురువారం ఆపార్టీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ప్రకటించారు.

నియామకపత్రాలు అందించిన బుద్ద నాగజగదీశ్
అనకాపల్లి, డిసెంబరు 30: అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుయువత కార్యవర్గాన్ని గురువారం ఆపార్టీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ప్రకటించారు. అధ్యక్షుడిగా పీవీఎస్‌ఎన్ రాజు (బుచ్చెయ్యపేట), ప్రధాన కార్యదర్శిగా కె.ఎర్రునాయుడు (అనకాపల్లి)ను నియమించారు. ఉపాధ్యక్షులుగా జి.నాగేశ్వరరావు, బండారు కొండబాబు, ఎస్.శ్రీరామమూర్తి, పరదేశి నాయుడు ఎన్నికయారు. స్పోక్స్ పెర్సన్‌గా బొడ్డేడ బాలమురళీకృష్ణ, అప్పులు గణేశ్, నీలాపు శంకరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిహెచ్.గంగనాగవెంకటసాయి, పూడి శ్రీను, బిటి నరేశ్, సిహెచ్.అమ్మోరయ్య, గుల్లేపల్లి. చిరంజీవి, బి.జగ్గారావు, బి.రాజు, పైల లోవసత్య రమేశ్‌నాయుడు, కార్యదర్శులుగా వెలగపూడి. సంతోష్ బాబు, ఆడారి గోవింద్, కొల్లి సూరినాయుడు, డి.చిరంజీవి, డి.కృష్ణ, జి.ఉదయ్‌కుమార్, పి.సురేశ్ బొడ్డు అప్పలరాజు, ఎం.సన్యాసినాయుడు, డి.నగేశ్, జి.నరసింగరావు, మీడియా కోఆర్డినేటర్ గోకం హరికృష్ణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కె.గణేశ్‌లను నియమించారు. అలాగే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎస్.సునీల్‌కుమార్, మట్ట సతీశ్ (నర్సీపట్నం), పెంటకోట విజయ్ (ఎలమంచిలి), సిహెచ్.ప్రదీప్ (పాయకరాపుపేట), కె.శ్రీనుయాదవ్ (పెందుర్తి), యడ్ల రమేశ్ (మాడుగుల), దేవర రవికుమార్ (చోడవరం)లను నియమించినట్టు బుద్ద తెలిపారు.