విశాఖ కేజీహెచ్‌లో సహజసిద్ధ ఆక్సిజన్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-05-22T04:18:24+05:30 IST

కేజీహెచ్‌లో నర్సింగ్‌ కళాశాల వసతి గృహం పక్కన సహజసిద్ధంగా ఆక్సిజన్‌ ఉత్పత్తికి దాదాపు రూ.3.4 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ శుక్రవారం ప్రారంభించారు.

విశాఖ కేజీహెచ్‌లో సహజసిద్ధ ఆక్సిజన్‌ ప్లాంట్‌
ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

రోజుకి 400 సిలెండర్ల ఉత్పత్తి సామర్థ్యం

రూ.3.4 కోట్లతో ఏర్పాటు...ప్రారంభించిన కలెక్టర్‌

విశాఖపట్నం,  మే 21:  కేజీహెచ్‌లో నర్సింగ్‌ కళాశాల వసతి గృహం పక్కన సహజసిద్ధంగా ఆక్సిజన్‌ ఉత్పత్తికి  దాదాపు  రూ.3.4 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆక్సిజన్‌ ఉత్పత్తి విధానాన్ని కలెక్టర్‌ తెలుసుకున్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా రోజుకు 400 ఆక్సిజన్‌ సిలెండర్లు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ ప్రత్యేక అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి, ఎలక్ట్రికల్‌ డీఈ ఫణికుమార్‌ తదితరు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-22T04:18:24+05:30 IST