శాంతియుత పోరాటాలతో విజయాలు సొంతం

ABN , First Publish Date - 2021-11-23T06:21:57+05:30 IST

శాంతియుత పోరాటాలతో విజయాలు సిద్ధిస్తాయని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు అన్నారు.

శాంతియుత పోరాటాలతో విజయాలు సొంతం
రిలే నిరాహార దీక్షల శిబిరంలో ప్రసంగిస్తున్న ఎన్‌..రామారావు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు

కూర్మన్నపాలెం, నవంబరు 22: శాంతియుత పోరాటాలతో విజయాలు సిద్ధిస్తాయని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 284వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో సింటర్‌ ప్లాంట్‌ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో రామారావు మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. విమానాశ్రయాలు, బ్యాంకులు, పోర్టులు ఇప్పటికే ప్రైవేటీకరణ అయ్యాయన్నారు.  ఈ నెల 26న జరిగే వంటావార్పు కార్యక్రమంలో కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, కేఎస్‌ఎన్‌ రావు, గంధం వెంకటరావు, వరసాల శ్రీనివాసరావు, మస్తానప్ప, రామ్మోహన్‌కుమార్‌, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, జి.ఆనంద్‌, నారాయణరావు, నరసింగరావు, బాబూరావు, మూర్తి, శ్రీనివాస్‌, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-23T06:21:57+05:30 IST