నిండుగొండ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-10-14T06:25:54+05:30 IST

మండలంలోని నిండుగొండ గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చుక్కా శివను సస్పెండ్‌ చేస్తూ డ్వామా పీడీ సందీప్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నిండుగొండ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌
ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శివ

రోలుగుంట, అక్టోబరు 13: మండలంలోని నిండుగొండ గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చుక్కా శివను సస్పెండ్‌ చేస్తూ డ్వామా పీడీ సందీప్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని గ్రామ సర్పంచ్‌ శెట్టి సంధ్య గత నెల 9న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తుల పేర్ల మీద, కొవ్వూరు జీడిపిక్కల కర్మాగారం కార్మికులు ఉపాధి పనులు కూడా చేస్తున్నట్టు మస్తర్లు వేయడం, కొంత మంది ఉపాధి పనులకు రాకపోయినా మస్టర్లు వేసి వారి నుంచి సగం డబ్బులు తీసుకోవడం, గ్రూపులకు పని కోసం కమీషన్‌ తీసుకోవడం వంటి ఆరోపణలు చేశారు. అలాగే రూ.15 లక్షల వరకు ఉపాధి నిధులు పక్కదారి పట్టించాడని గ్రామ సభలో తీర్మానం చేసి డ్వామా అధికారులకు పంపించారు. గ్రామ సభ తీర్మానం, ప్రతిపాదనలను అనుసరించి డ్వామా పీడీ సందీప్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శివను సస్పెన్షన్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-10-14T06:25:54+05:30 IST